బెండకాయల గురించి  మీకు తెలియని షాకింగ్  నిజాలివి..

బెండకాయలలో ఉండే ఫైబర్, పాలీఫెనాల్స్ రక్తంలో  చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 

బెండకాయలలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బెండకాయలలో యాంటీఆక్సిడెంట్లు హనికరమైన ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించి, డిఎన్ఎ కణాల నష్టాన్ని తగ్గిస్తాయి.

అధికంగా ఫైబర్ ఉండటం వల్ల శరీరం కొలస్ట్రాల్ గ్రహించడాన్ని నియంత్రిస్తుంది.

బెండకాయలలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణాశయంలో జెల్ లాగా ఏర్పడి జీర్ణాశయాన్ని, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

విటమిన్-సి, కాల్షియం, మెగ్నీషియం వంటివన్నీ బెండకాయలో ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి,బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడతాయి.

బెండకాయలలో ఉండే విటమిన్-సి  ఇన్ఫెక్షన్లను, జబ్బులను దూరం చేస్తుంది.