ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి అందరికి తెలిసిందే. వ్యాయామం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.
రోజూ వ్యాయామం చేయలేని వారు.. ప్రతి రోజూ ఓ పావు గంట స్కిప్పింగ్ చేస్తే చాలు.
రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల.. కేవలం ఫిట్‌నెస్సే కాదు.. ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.
అరగంట స్కిప్పింగ్ చేస్తే.. 750 క్యాలరీలు వరకూ ఖర్చు అవుతాయి. కాబట్టి వెయిల్ లాస్ కావాలంటే.. ఈజీగా స్కిప్పింగ్ చేసి బరువు తగ్గొచ్చు.
స్కిప్పంగ్ ఆడటం వల్ల మీకు తెలియకుండానే సంతోషంగా ఫీల్ అవుతారు. దీంతో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది.
రోజు స్కిప్పింగ్ ఆడటం వల్ల గుండె పని తీరు మెరుగు పడుతుంది. దీని వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. బరువు తగ్గి, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయి.
ప్రతి రోజు ఈ ఆట ఆడడం వల్ల ఊపిరి తిత్తులకు చాలా మంచిది. స్కిప్పింగ్ అనంతరం శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. దీని వల్ల ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా పని చేస్తాయి.
స్కిప్పింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి దూరమవుతాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో ఒత్తిడి దూరమవుతోంది.