వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లు తింటే మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
అయితే మామిడి పండ్లలాగే మామిడి ఆకులు కూడా అనేక పోషకాలు కలిగి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాటిని టీ చేసుకుని తాగినా లేదా కషాయంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు
జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు మామిడి ఆకుల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.
అలాగే మామిడి ఆకుల టీతో డయాబెటిస్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మామిడి ఆకులను ఎలా పడితే అలా తీసుకోకూడదు. దానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి.
మామిడి ఆకులను నీటిలో మరిగించి కషాయంగా తీసుకోవచ్చు. మామిడి ఆకులతో టీ చేసుకుని తాగొచ్చు. అలాగే ఆకులను మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుని శరీరంపై రాసుకుంటే చర్మం కాంతివతంగా మారుతుంది.