మొల‌క‌లతో ఇలా చేస్తే..  ఎన్నో లాభాలు..

మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఇక ఇందులో ఉండే ఫైబర్, ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇదే కాకుండా ఇందులో క్యాలరీలు తక్కువ. ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. 

దీంతో పాటు మొలకలలో ఇనుము శాతం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

ఇది రక్తహీనత సమస్య నివారించడంలో సహాయపడుతుంది.

 మొలకలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.