ఈ నీరు తాగితే షుగర్ పరార్..

జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఇది దివ్యౌషధంగా భావిస్తారు.

ముందుగా, జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. 1-2 టేబుల్ స్పూన్ల జీలకర్రను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి.

ఉదయం ఆ నీటిని మరిగించి, చల్లబరచండి ఆ తరువాత వడకట్టి తాగాలి. రుచి కోసం కొద్దిగా తేనె కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

నెల పాటు ప్రతిరోజూ ఉదయం జీలకర్ర నీటిని తాగటం వల్ల మీ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, పేగు సమస్యలను తగ్గిస్తుంది.

బరువును తగ్గించడంలో కూడా జీలకర్ర నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

తరచూ జీలకర్ర నీటిని తాగటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుండి రక్షిస్తుంది

ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించడం ద్వారా నిర్విషీకరణ చేస్తుంది

రక్తపోటును నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.