శరీరంలో జీవక్రియల వేగాన్ని సహజసిద్ధంగా పెంచే సూపర్ ఫుడ్స్ ఏవంటే..

మిర్చిలో ఉండే కాప్సియాసిన్ అనే రసాయనం జీవక్రియల వేగం పెంచి కెలరీలు త్వరగా ఖర్చయ్యేలా చేస్తుంది

కాఫీలోని కెఫీన్ కూడా జీవక్రియల వేగాన్ని పెంచుతుంది

ప్రొటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణం చేసేందుకు శరీరం ఎక్కువగా కెలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది

అల్లం శరీరంలో ఉష్ణం జనించేలా చేసి జీవక్రియల వేగం పెంచుతుంది

అల్లం టీలోని కాటచిన్స్, యాంటీఆక్సిడెంట్స్, కెఫీన్ కూడా జీవక్రియల వేగాన్ని అమితంగా పెంచుతాయి

కోడి గుడ్లను జీర్ణం చేసేందుకు శరీరం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా జీవక్రియల వేగం పెరుగుతుంది

నారింజలోని విటమిన్ సీ ఇతర పోషకాలు శరీరంలోని విషతుల్యాలు తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి