కడుపు నిండా తిన్నా కూడా ఇంకా తినాలనిపించడం శరీరంలో పోషకాల లోపం వల్ల కావచ్చు.

ఆహారంలో ప్రొటీన్లు, పీచు పదార్థం తక్కువగా ఉంటే త్వరగా ఆకలి వేస్తుంది.

భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే, అది రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు.

కొన్నిసార్లు దాహాన్ని కూడా ఆకలిగా భావించే అవకాశం ఉంటుంది. రోజంతా తగినంత నీరు తాగకపోతే తినాలనే కోరిక పెరగొచ్చు.

నిద్రలేమి వల్ల ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, మళ్లీ ఆకలి వేయవచ్చు.

మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా కొంతమంది ‘ఎమోషనల్ ఈటింగ్’ కు అలవాటు పడతారు.

తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే.. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి.