గోర్లు మన చేతుల అందాన్ని పెంచడమే కాకుండా మన ఆరోగ్య స్థితిని కూడా తెలియజేస్తాయి.

గోళ్ల రంగులో మార్పును బట్టి మీ శరీరంలో ఏ పోషకాలు లోపిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

గోళ్లపై ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

గోళ్లు పసుపు రంగులోకి మారితే విటమిన్, ఖనిజాల లోపానికి సూచిక కావచ్చు.

గోళ్లు తరచూ విరగడం లేదా బలహీనపడటం.. ప్రోటీన్, కాల్షియం, జింక్ లోపానికి సంకేతం కావచ్చు.

పాలిపోయిన లేదా తెల్లటి గోళ్లు శరీరంలో ఐరన్ లోపం, కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు.

నీలం రంగులోకి మారిన గోళ్లు.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం లేదా గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం కావచ్చు.