నిమ్మకాయను వాడిన తర్వాత చాలామంది తొక్కను పారేస్తుంటారు.

కానీ.. నిమ్మ రసంలో కంటే నిమ్మ తొక్కలోనే ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మ తొక్కలోని విటమిన్‌ C రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు నిమ్మ తొక్క మేలు చేస్తుంది.

నిమ్మ తొక్కలోని పెక్టిన్‌ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో నిమ్మ తొక్క సహాయపడుతుంది.

చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలను తగ్గించడంలో నిమ్మ తొక్క పొడి బాగా పనిచేస్తుంది.

ఎండబెట్టిన నిమ్మ తొక్కలను నీటిలో మరిగించి గ్రీన్ టీ లాగా తాగవచ్చు.