పోషకాలనిచ్చే పాలకూర.. బోలెడన్ని లాభాలివిగో..

పాలకూరలో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పాలకూర తోడ్పడుతుంది.

పాలకూరలోని విటమిన్-ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటి శుక్లం, మాక్యులర్ క్షీణతను నివారిస్తుంది.

ఇందులోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ బరువును తగ్గించడంలో సాయపడతాయి.

పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

పాలకూర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవ్వడం సహా ఫ్లేవనాయిడ్స్ వల్ల మతిమరుపును నివారిస్తాయి.

పాలకూర రక్తాన్ని శుద్ధి చేసే గుణాన్ని  కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పాలకూర చక్కని ఆహారం. దీనిని జ్యూస్‌లాగా కూడా తీసుకోవచ్చు.