లైంగిక ఆరోగ్యాన్ని పెంచే  సింపుల్ చిట్కాలు..

లైంగిక అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వాటికి సైతం సరైన పోషకాహారం అవసరం. అందుకోసం ఖనిజాలు, విటమిన్లు కలిగిన కొన్ని ఆహారాన్ని తీసుకోవాలి.

అత్తిపండ్లు.. వీటినే అంజీర్ పండ్లు అని కూడా అంటారు. వీటిలో సంతానోత్పత్తిని పెంచే గుణం ఉందంటారు. ఇది గుండె ఆరోగ్యంతోపాటు పునరుత్పత్తి అవయవాలకు మెరుగైన ప్రసరణ కలిగిస్తుంది.

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన pH స్థాయిలను నిర్వహిస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. 

బాదం పప్పు.. సంతానోత్పత్తికి సహాయపడుతుంది. వీటిలో పోషకాలతోపాటు జింక్, సెలీనియం, విటమిన్ ఈ ఉంటుంది. 

టమోటా.. తినే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 18 శాతం తక్కువగా ఉంటుంది.

దీనిలోని లైకోపీన్ కణాలు, డీఎన్ఏ దెబ్బతినే టాక్సిన్లతో పోరాడుతుంది. స్పెర్మ్ (శుక్ర కణాలు)ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

అల్లం.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 

పుచ్చకాయలో సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లం కారణంగా లిబిడోను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సిట్రుల్లైన్ రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. రసం రూపంలో అయినా తీసుకోవచ్చు.

ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు తీసుకోవాలి. పాలకూర, మెంతి, కాలే తదితర ఆకు కూరలు రక్త ప్రసరణను పెంచుతాయి. అంతేకాకుండా లైంగిక అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.