మనలో చాలా మంది నాన్ వెజ్ ఇష్టంగా తింటుంటారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా రకరకాలుగా తింటుంటారు.
మేక రక్తం పోషకాలతో నిండిన ఆహారం. ఇది ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12తో సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతను నివారించి, ఎర్ర రక్త కణాలను పెంచుతుంది.
మేక రక్తంలో ప్యూరిన్ అధికంగా ఉన్నందున యూరిక్ యాసిడ్, గౌట్ సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి లేదా నివారించాలి. వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇది కండరాల పెరుగుదలకు, వివిధ శరీర కదలికలకు సాయపడుతుంది.
మేక రక్తంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మేక రక్తం ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.
ఈ రోజుల్లో చాలా మంది యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నారు. అలాంటి వారు మేక రక్తం ఎక్కువగా తీసుకోకూడదు.
మేక రక్తం తినడానికి ముందు బాగా శుభ్రం చేసి ఉడికించాలి. శుభ్రత లేని రక్తాన్ని సేకరించి దాన్ని వండుకుని తింటే ఇన్ఫెక్షన్లు, వైరస్, బ్యాక్టీరియాలతో ముప్పు కలగవచ్చు.