కొన్ని పండ్లను పాలతో కలిపి తీసుకుంటే విషంగా మారతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లను పాలతో కలిపి తీసుకోవద్దు. ఇలా చేస్తే గ్యాస్, అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
స్ట్రాబెర్రీలు, కివీ వంటి పండ్లను పాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది.
పైనాపిల్‌ను కూడా పాలతో కలిపి తీసుకోవద్దు. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్, పాలోని కేసైన్ అనే ప్రోటీన్‌తో కలిసి కడుపు నొప్పి, వాంతులకు కారణమవుతుంది.
ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఏది కలిపి తీసుకోవాలనే దానిపై జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.