స్పాట్ జాగింగ్‌తో  ఇన్ని ప్రయోజనాలా..

రోజూ 10 నిమిషాలు స్పాట్ జాగింగ్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. 

 రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.

 ఇది శరీరం ఆక్సిజన్‍ను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది.

శరీరంలో కేలరీలు బర్న్ చేయడానికి స్పాట్ జాగింగ్ భలేగా సహాయపడుతుంది.

 దీని వల్ల ఆందోళన, నిరాశ తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది.

స్పాట్ జాగింగ్ చేస్తే శరీర కండరాలు బలపడతాయి. 

స్పాట్ జాగింగ్. వాకింగ్, రన్నింగ్ కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 

కాబట్టి.. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నవారైనా దీన్ని చేయవచ్చు.