పిల్లలకు ఆవు పాలు
తాగిస్తున్నారా..!
బిడ్డ పుట్టిన తరువాత తల్లికి పాలు పడకపోయినా, తల్లిపాలు బిడ్డకు చాలకపోయినా చాలామంది ఆవు పాలు ఎంచుకుంటారు.
కానీ ఏడాది వయసులోపు పిల్లలకు ఆవు పాలు అస్సలు ఇవ్వకూడదని వైద్యులు చెబుతున్నారు.
చిన్నపిల్లలలో జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది.ఈ కారణం వల్ల పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల వారిలో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.
ఆవు పాలలో ఎక్కువ మొత్తంలో సోడియం, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. ఇవి పిల్లలకు జీర్ణం కావడం కష్టం.
చిన్నపిల్లలకు ఐరన్, విటమిన్-ఇ అవసరం అవుతాయి. ఇవి ఆవు పాలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.
ఐరన్ సరిపడినంత లేకపోవడం వల్ల పిల్లలలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది పిల్లలలో రక్తహీనత సమస్యకు కారణమవుతుంది.
ఏడాది నిండిన పిల్లలకు
ఆవు పాలు ఇవ్వవచ్చు.
ఏడాది తరువాత ఆవు పాలు ఇవ్వడం వల్ల పిల్లలలో కాల్షియం లోపం తొలగిపోతుంది, ఎముకలను బలపరుస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..
నొటి పుండ్లకు ఇలా చెక్ పెట్టేదాం
చక్కెర తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
రాత్రి వేళల్లో పండ్లు తినడం వల్ల కలిగే 5 నష్టాలివే..