వర్షాకాలంలో వేడి నీరు తాగడం మంచిదేనా?

  వర్షాకాలంలో చాలా మంది ఉదయం పరగడుపున వేడి నీళ్లు తాగుతుంటారు.  

  అసలు వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

 వేడి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన జీర్ణసమస్యలు తొలిగిపోతాయంట.

 మలబద్ధకం సమస్యతో  ఉన్న వారు ప్రతి రోజు పరగడుపున వేడి నీరు తాగలంట.

వేడినీరు తాగడం వల్ల  జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

  ఉదయాన్నే వేడి నీరు తాగడం వలన గొంతు, శ్వాసకోశ వ్యాధులు కూడా దూరమవుతాయంటున్నారు నిపుణులు.

మరిగించిన నీరు త్రాగడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది, ముక్కు కారటం క్లియర్ అవుతుంది, గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

 అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తప్పకుండా వేడి నీరు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు