మెటబాలిజమ్ పెరగడానికి  ఈ సూపర్ టిప్స్ పాటించండి..

రోజుకు మూడు సార్లు ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవాలి. రుచికి మాత్రమే కాకుండా పోషకాలు ఉన్న ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. 

వేడిగా, పొడిగా ఉండి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీనిని కఫా డైట్ అంటారు. ఇది మెటబాలిజమ్‌ను పెంచుతుంది.

వారంలో కనీసం మూడు రోజులు వ్యాయామం చేయాలి. ఉదయాన్నే చేసే వ్యాయామం వల్ల మెటబాలిజమ్ పెరిగి రోజంతా కొవ్వు బర్న్ అవుతూ ఉంటుంది. 

ఆయుర్వేదం ప్రకారం వేడి నీరు లేదా వేడి టీ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. కాబట్టి వేడి ద్రవాలను తీసుకోవడం ఉత్తమం

రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోండి. తగినంత నిద్ర ఉన్నప్పుడే మెటబాలిజమ్ మెరుగవుతుంది

రాత్రి ఏడు గంటలకు ముందు భోజనం పూర్తి చేయాలి. తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలా చేయడం వల్ల నిద్రపోయేలోపు ఆహారం జీర్ణమవుతుంది. డీటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది

త్రిఫల చూర్ణం మీ శరీరాన్ని శుభ్రం చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది

మీ శరీరానికి తగినన్ని విటమిన్లు అందించి డీటాక్సిఫికేషన్ చేయడంలో ఉసిరి గణనీయమైన పాత్ర పోషిస్తుంది. 

మెటబాలిజమ్ సక్రమంగా ఉంటే మీ బరువు తగ్గుతుంది. శరీరంలో కొవ్వు తగ్గి మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.