సాధారణంగా మనం నిమ్మరసం తీసుకున్న తర్వాత తొక్కలను పనికిరానివిగా  భావించి పారేస్తాం.

కానీ నిమ్మ రసం కంటే దాని తొక్కలోనే పోషకాలు మెండుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

నిమ్మ తొక్కను నేరుగా తినలేం కానీ, దాన్ని తురుముగా చేసి సలాడ్లు, పెరుగు లేదా సూప్‌లలో కలిపి తీసుకోవచ్చు.

ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

నిమ్మ తొక్క వాడినప్పుడు మొటిమలు మాయమవుతాయి. దాని వల్ల మచ్చలు కూడా త్వరగా పోతాయి. ఇది చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను నయం చేస్తుంది.

నిమ్మకాయ తొక్కలను నీటిలో మరిగించి తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది,

క్యాన్సర్ వంటి మహమ్మారులతో పోరాడే శక్తి కూడా నిమ్మ తొక్కల్లో ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

నిమ్మ తొక్కలోని సమ్మేళనాలు రక్తపోటును నియంత్రించడంలో, గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.