నిద్ర తక్కువ అయితే.. ఈ సమస్యలు గ్యారంటీ..?

కడుపు నిండా ఆహారం. కంటి నిండ నిద్ర ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ప్రతి మనిషి రోజుకు 8 గంటల నిద్రపోవాలని సూచిస్తారు. నిద్ర తక్కువ అయితే మాత్రం మీరు డేంజర్‌లో ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం.. మరి ముఖ్యంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు బారిన పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నిద్ర తక్కువ అయితే గుండె సమస్యలు పెరుగుతాయి. అంటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తపోటు పెరిగి.. గుండెపోటు రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

జ్ఞాపకశక్తి సైతం తగ్గుతుంది.

నిద్రలేమి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏకాగ్రత తగ్గే ప్రమాదం ఉంది. ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తొందరగా వ్యాపిస్తాయి.

రోజులో ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల ఆకలి నియంత్రించే హార్మోన్లు స్థిరంగా ఉండవు. దీని వల్ల అధిక ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు పెరుగుతారు.

నిద్రలేమి వల్ల ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తదితర సమస్యలు అధికమవుతాయి.

నిద్ర తక్కువ పోవడం వల్ల ముఖం కాంతి హీనంగా మారుతుంది. 

తక్కువ నిద్ర వల్ల స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.

రోజులో ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్దకం తదితర సమస్యల తీవ్రత పెరుగుతుంది.