ఈ విషయం తెలిస్తే హ్యాండ్ షేక్ ఇవ్వడానికి భయపడతారు..

షేక్ హ్యాండ్ కారణంగా ప్రాణాంతకమైన రోగాలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. 

హ్యాండ్ షేక్ ఇచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

షేక్ హ్యాండ్ ద్వారా జలుబు ఒకరిని నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 

ఫ్లు అనేది జలుబు కంటే తీవ్రమైనది. ఫ్లు వైరస్ మనిషి చేతిపై కొన్ని గంటల పాటు ప్రాణాలతో ఉండగలదు. ఈజీగా వ్యాపిస్తుంది.

కండ్ల కలకలు హ్యాండ్ షేక్ ద్వారా అత్యంత వేగంగా ఒకరిని నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. 

కోల్డ్ సోర్స్ ‘హెర్పెస్ సింప్లెక్స్ వైరస్’ కారణంగా వస్తాయి. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ హ్యాండ్ షేక్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది. 

షేక్ హ్యాండ్ ద్వారా ఫంగీ, స్టాఫ్ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది చర్మం ఎర్రగా మారటం, చిన్ని చిన్న పుండ్లు ఏర్పడటం, దురద వంటివి వస్తాయి.