చిగుళ్ల వాపుతో  ఇబ్బంది పడుతున్నారా..  వీటిని ట్రై చేయండి..

నోటి పరిశుభ్రత లేదా ఆరోగ్యంలో ఏదైనా లోపం ఉంటే చిగుళ్ళ వాపు సమస్య రావచ్చు.

ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల చిగుళ్ల వాపు దంతాలకు తీవ్ర హాని కలిగిస్తుంది. 

చిగుళ్ల వాపు పెరిగితే అది పీరియాంటైటిస్ వంటి తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది.

దంతాలను శుభ్రం చేయడానికి మృదువైన బ్రష్‌ను ఉపయోగించండి. ఇది మీ చిగుళ్ళను కాపాడుతుంది. బలంగా ఉంచుతుంది.

గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోండి.

చిగుళ్ళలో నొప్పి ఉంటే లవంగం నూనెతో  తేలికగా మసాజ్ చేయండి.

గోరువెచ్చని నీటిలో  నిమ్మరసం కలిపి రోజుకు రెండుసార్లు నోటిని కడగాలి.