నైట్ డ్యూటీ చేస్తున్నారా?  ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

రాత్రిపూట నిద్రపోకుండా ఉండేందుకు టీ, కాఫీ తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

రాత్రిపూట మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోవడం మంచిది.

యోగా, మెడిటేషన్ వంటివి చేయడం అవసరం. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

బాడీ హైడ్రేట్‌గా ఉండేందుకు నీరు ఎక్కువగా తాగాలి.

నైట్ షిఫ్ట్ చేసేవారు మధ్యాహ్నం, సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవద్దు.

 రాత్రి డ్యూటీ చేసి వచ్చాక. ఉదయం నాలుగు గంటలు, మళ్లీ డ్యూటీకి వెళ్లే ముందు రెండు గంటలు నిద్రపోయేందుకు సమయం కేటాయించండి.

 నైట్ డ్యూటీ చేసి ఇంట్లో పనులు చేయాల్సి వస్తే అందుకోసం ప్రత్యేక  సమయం కేటాయించండి.