కురులు, షుగరు, మలబద్ధకానికి  హోల్‌సేల్ పరిష్కారం.. 

జీలకర్ర కంటే.. నల్ల జీలకర్ర వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు పలు అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయని చెబుతారు.

నల్ల జీలకర్రను కలోంజీ లేదా నల్ల విత్తనాలు అంటారు. ఇవి నల్ల నువ్వులను పోలి ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని అధికంగా వినియోగిస్తారు. 

వీటిలో ప్రొటీన్​, ఫైబర్​, ఐరన్​, కాపర్​, జింక్​ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని చెబుతున్నారు. 

ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా అజీర్ణం, గ్యాస్, అధిక ఆమ్లత్వం, మలబద్ధకం వంటి ఇబ్బందులను అదుపు చేస్తుంది.

నల్ల జీలకర్ర మెటబాలిజం రేటును పెంచి, కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే ఆకలిని తగ్గించడంతో పాటు బరువుని నియంత్రిస్తుంది.

శ‌రీరంలో త‌గినంత ఆక్సిజ‌న్ లేక‌ పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుందని చెబుతున్నారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం నల్ల జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగు పరిచి.. రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలను తగ్గిస్తాయి.

బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ స్టడీ ప్రకారం.. నల్ల జీలకర్రకు ఒంట్లోని చక్కెర స్థాయిలు తగ్గించే గుణముందని స్పష్టం చేసింది.  ఇదే విషయాన్ని నేషనల్​ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం సైతం వివరించింది.

చాలా మందికి నిద్ర లేమి పెద్ద సమస్య. దీనికి చెక్‌ పెట్టాలంటే రాత్రి నిద్రపోవడానికి ముందు ఓ కప్పు కలోంజీ (నల్ల జీలకర్ర) టీ తాగితే..  మంచిదని.. హాయిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు.

న‌ల్ల జీల‌క‌ర్ర‌ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది.

నల్ల జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఖనిజ లవణాలు.. హాని కారక ఫ్రీ రాడికల్స్‌ ఉత్పత్తిని తగ్గించి క్యాన్సర్‌ వంటి వ్యాధులు వ్యాప్తి చెందడాన్ని అడ్డుకుంటాయని అంటున్నారు.

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. శరీరంలోని వ్యర్థ్యాలను బయటకు పంపి.. మెటబాలిజం రేటును మెరుగుపరుస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

జట్లు రాలడాన్ని సైతం ఇవి అరికడతాయని చెబుతారు. కలోంజీ విత్తనాలను ఉపయోగించి ఇంట్లోన హెయిర్ డైలు తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.