బంగాళదుంపలో అనేక పోషకాలు ఉన్నప్పటికీ రోజూ తింటే కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కెలొరీలు అధికంగా ఉండే బంగాళదుంప అతిగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది

వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది

బంగాళదుంప చిప్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా బీపీ వచ్చే అవకాశం ఉంది

నిత్యం బంగాళదుంపలు తింటే పోషకాల లోపం తలెత్తే అవకాశం ఉంది. కడుపులో కూడా ఇబ్బంది తెలెత్తొచ్చు

బంగాళదుంపలు వేయిస్తే అక్రిలమైడ్ అనే క్యాన్సర్ కారక రసాయనం తయారవుతుంది. 

చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి బంగాళదుంపలతో  టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ

రోజూ బంగాళదుంప తినేవారిలో అలర్జీలు, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా రావొచ్చు.