యాపిల్ గింజలు తింటే ప్రాణాలకు ముప్పా..?
రోజూ ఒక యాపిల్ తింటే పలు రోగాలను దూరం చేసుకోవచ్చునని డాక్టర్లు చెబుతుంటారు.
ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని పలు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి.
యాపిల్ తినేటప్పుడు అందులోని గింజల విషయాన్ని చాలామంది పట్టించుకోరు.
కొందరు మాత్రం గింజలు కూడా తినేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయట.
యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విష సమ్మేళనం ఉంటుంది. వీటిని తిన్నా, నమిలిలా అమిగ్డాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది
ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. చిన్న మొత్తంలో సైనైడ్ శరీరానికి స్వల్పకాలిక తేలికపాటి నష్టాన్ని కలిగిస్తుంది
ఇందులో తలనొప్పి, గందరగోళం, అలసట, నీరసం తదితర సమస్యలు తలెత్తుతాయి.
ఇక శరీరంలో సైనైడ్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, స్ట్రోక్స్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి.
ఒక్కోసారి కోమాలోకి వెళ్లి మరణం కూడా సంభవించవచ్చు.
యాపిల్స్ తినడానికి, యాపిల్ జ్యూస్ తాగే ముందు వాటి విత్తనాలను తొలగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!
హైపో థైరాయిడ్ లక్షణాలు ఇవే!
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ప్రేమలో పదే పదే మొసపోతారట