ప్లాస్టిక్ బాటిల్‌లో  నీళ్లు తాగుతున్నారా..!

ప్లాస్టిక్ బాటిళ్లలో బీపీఏ, థాలేట్స్, సీసం, కాడ్మియం, పాదరసం, వంటి అనేక హానికర రసాయనాలు ఉంటాయి. 

ఈ వాటర్ బాటిళ్లు వేడి ప్రదేశంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎండలో పెట్టినప్పుడు బాటిల్ నుంచి ఈ ప్రమాదకర రసాయనాలు నీటిలో కలుస్తాయి. 

ఇలాంటి నీటిని మనం తాగితే హార్మోర్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నానోప్లాస్టిక్స్ అనే అతి సూక్ష్మ కణాలు ఉంటాయి.

మనం నీళ్లు తాగినప్పుడు ఇవి నేరుగా రక్తంలో కలిసి శరీర భాగాలకు చేరుతాయి.

ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగే బదులు రాగి, మట్టి నీటి సీసాలు, సిరామిక్ బాటిళ్లలో నీటిని తాగడం ఉత్తమమని పలువురు వైద్యులు సూచిస్తున్నారు.