ఇవి తింటే చాలు  ఒత్తిడి, ఆందోళన పరార్..

అవకాడోలలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది.

బ్లూబెర్రీస్‌లో ఒత్తిడిని తగ్గించే గుణాలున్నాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో కలిపి  తీసుకోవడం వల్ల ఒత్తిడికి రిలీఫ్ ఉంటుంది. 

గుడ్డు సొనలో విటమిన్ డి ఉంటుంది. ఇది డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది.

కాయగూరలు, పండ్లు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు.

జీడిపప్పు, మెగ్నీషియం, మానసిక స్థితి, ఆందోళన లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

చియా విత్తనాలు, గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.