మానసిక సామర్థ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సహా శరీరాన్ని నియంత్రించేది మెదడు.
అందుకే మంచి ఆహారంతో పోషకాలు అందిస్తూ దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
అలాంటి ఆహార పదార్థాల్లో ఆలీవ్ ఆయిల్ ఒకటి. దీన్ని వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం..
ప్రతి రోజూ కనీసం 7 గ్రాముల ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది.
మతిమరుపు (డిమెన్షియా) ప్రమాదాన్ని తగ్గిస్తుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది.
ఇది వాడే వారిలో మతిమరుపుతో వచ్చే మరణాల ప్రమాదం 28 శాతం తగ్గిందని వెల్లడించింది.
మెదడులోని కణాల నిర్మాణాన్ని, పనితీరును ఆలీవ్ ఆయిల్ మెరుగుపరుస్తుందని చెప్పింది.
పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తాయని వెల్లడించింది.
అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుందని యూనివర్శిటీ తెలిపింది.
మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుందని, రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పేర్కొంది.
ఆలివ్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని హార్మోన్ల సమతుల్యత కాపాడుతుందని తెలిపింది.
Related Web Stories
గుండెపోటు రాకుండా ఉండేందుకు.. మీ ఆహారంలో చేర్చాల్సిన 7 విత్తనాలివే..
వాటర్క్రెస్ ఆహారంలో తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..!
పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..!
మూత్రపిండాల్లోని రాళ్ళుకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..