గుండెపోటు రాకుండా ఉండేందుకు.. మీ ఆహారంలో చేర్చాల్సిన 7 విత్తనాలివే.. 

అవిసె గింజల్లోని ఒమెగా-3, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్.. కొలెస్ట్రాల్‌తో పాటూ వాపును తగ్గించడంలో సాయం చేస్తాయి. 

పొద్దుతిరుగుడు విత్తనాల్లోని విటమిన్-ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు.. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. 

నువ్వుల్లోని లిగ్నన్లు, యాంటీఆక్సిడెంట్లు.. ధమనుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. 

జనపనార విత్తనాల్లోని ఒమెగా-3, ప్రొటీన్లు.. శరీరంలోని వాపును తగ్గించడంలో సహకరిస్తాయి.

కలోంజి విత్తనాలు కూడా గుండె సంరక్షణకు దోహదం చేస్తాయి. 

చియా విత్తనాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమెగా-3.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.