ఈ టీతో అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం

టీ, అల్లం టీ, గ్రీన్ టీ, బెల్లం టీ ఇలా రకరకాల టీల గురించి తెలుసు

రోజ్‌ టీ ఎప్పుడైనా తాగారా.. దీని వల్ల ప్రయోజనాలు ఎన్నో

రోజ్ టీ అందానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

రోజ్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ ఇస్తాయి

చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు మంటను తగ్గిస్తుంది రోజ్ టీ

రోజ్ టీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది

రోజ్‌ టీ తయారీ విధానం: ఒకకప్పు గులాబీ రేకులు రెండు కప్పుల నీరు తేనె లేదా చక్కెర కొన్ని చుక్కల నిమ్మరసం టీ ఆకులు

తయారీ విధానం: గులాబీ రేకులను శుభ్రంగా కడిగి, ఓ గిన్నెలో వేసి నీరు పోసి మరిగించుకోవాలి. ఈ రేకులతో పాటు టీ ఆకులు వేసుకోవచ్చు

తరువాత ఆ నీటిని గ్లాసులో వడకట్టి రుచికి సరిపడా చక్కెర లేదా తేనె వేసుకుని.. నిమ్మరసం వేసుకుంటే రోజ్ టీ రెడీ.