ఐపీఎల్‌కు ముందు విదేశాల్లో రోహిత్..  సీజన్ దగ్గర పడుతున్నా..

క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్‌కు ఇంకో 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 

ఆటగాళ్లంతా తమ జట్లతో చేరిపోయి నెట్స్‌లో చెమటలు కక్కుతున్నారు. కానీ రోహిత్ ఇంకా ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో జాయిన్ కాలేదు.

ఫ్యామిలీతో కలసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు హిట్‌మ్యాన్.

మాల్దీవుల్లోని సముద్ర తీరం, బీచ్‌లు, పచ్చని ప్రకృతి నడుమ సేదతీరుతున్నాడు భారత సారథి.

మాల్దీవుల్లో కూతురు సమైరాతో కలసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు రోహిత్.

వరుస క్రికెట్ షెడ్యూల్‌తో బిజీ అయిపోవడంతో వెకేషన్‌లో రిలాక్స్ అవుతున్నాడు.  

వెకేషన్‌తో తిరిగి రీచార్జ్ అయి.. ఐపీఎల్‌లో అదరగొట్టాలని అనుకుంటున్నాడు రోహిత్. అయితే ట్రెయినింగ్ సెషన్‌లో కాకుండా నేరుగా మ్యాచుల్లో పాల్గొంటే ఎలా ఆడతానేడది ఆసక్తిని రేకెత్తిస్తోంది.