కొందరికి కడుపు ఖాళీగా ఉన్న సందర్భాల్లో తలనొప్పి వస్తుంటుంది.

కడుపు ఖాళీగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి  మెదడు పనితీరు మందగిస్తుంది. 

ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడి కారక కార్టిసాల్, అడ్రెనలిన్ హార్మోన్‌లు విడుదల అవుతాయి

ఈ హార్మోన్‌లు మెదడులోని రక్తనాళాలను సంకోచవ్యాకోచాలకు గురిచేసి తలనొప్పి కలుగజేస్తాయి. 

డీహైడ్రేషన్, ఆకలి కారణంగా కండరాలు ఒత్తిడికి గురై తలనొప్పి తీవ్రతను పెంచుతాయి. 

ఈ పరిస్థితిని నివారించేందుకు కనీసం ఆరు గంటలకు ఒకసారి స్వల్ప మొత్తంలో ఫుడ్ తీసుకోవాలి

ఈ సమస్య ఉన్న వారు వీలైనంత వరకూ ఉపవాసాలు కూడా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.