చేప కళ్ల వల్ల లాభాలు తెలిస్తే..
కళ్లు తేలేస్తారు..
చేపలు ఆరోగ్యానికి మంచివని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చికెన్, మటన్ తిన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ.. చేపల వల్ల మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతుంటారు.
చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక చేప తలను కూడా ఇష్టంగా తీసుకుంటారు. అయితే చేప కళ్లను మాత్రం పడేస్తుంటారు.
చేప తల ఎంత మేలు చేస్తుందో కళ్లు కూడా అంతే మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చేప కళ్లను తింటే కంటి చూపు మెరుగవుతుందని అంటున్నారు. కేవలం కళ్ల ఆరోగ్యమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చేప కళ్లు మంచివని అంటున్నారు.
చేప కళ్లను తీసుకోవడం వల్ల మెదడులో రక్తప్రసరణ క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడుతుంది. దీంతో పక్షవాతం వంటి సమస్యలు రాకుండా నిపుణులు చెబుతున్నారు.
చేప కళ్లలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగై జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా..
ఈ జ్యూస్ తాగితే.. ఇన్ని లాభాలా..
వర్షాకాలంలో బ్రోకలితో కలిగే ఊహించని లాభాలివే..
ప్రెగ్నెన్సీ సమయంలో టీ తాగితే ఏమవుతుందో తెలుసా..