ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా..

ఆవాలను మరపట్టి లేదా  గానుగలో ఆడించి ఆవాల నూనె తీస్తారు.

దీన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రధాన వంట నూనెగా ఉపయోగిస్తారు.

అయితే.. కేవలం వంటలకే కాకుండా జుట్టు సంరక్షణలోనూ, చర్మ సంరక్షణలోనూ, ఆరోగ్య సంరక్షణలోనూ దీన్ని ఉపయోగిస్తారని  చాలామందికి తెలియదు.

 ఆవనూనెలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది. ఆకలి హార్మోన్లు సమతుల్యం అవుతాయి.

ఆవనూనెతో వండిన వంటలు తింటే అది కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. 

ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు నయం అవుతాయి. మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారికి చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది.

ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో ఆవాలనూనె వాడటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

ఇది ముఖం మీద మొటిమలు, ముడతలు, పొడిచర్మం వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. 

ఆవాల నూనె జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి, జుట్టుకు మెరుపు అందించడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది.