ఖర్చు లేని పని.. గ్లాస్ నీటితో బీపీ, షుగర్ కంట్రోల్
కిడ్నీ, హై కొలెస్ట్రాల్, అధిక బరువు తదితర సమస్యలతో ఇబ్బంది పడే వారికి బార్లీ నీళ్లు ఒక వరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ నీరు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా, అనేక వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుంది.
ఈ నీరు ప్రతి రోజు ఉదయాన్నే తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.
ముఖ్యంగా ఇది హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బార్లీ నీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది కడుపు సంబంధ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ మెరుగు పడేలా చేస్తుంది.
ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగడం వలన.. గుండెల్లో మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
మూత్ర పిండాల సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ బార్లీ నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలంటారు. ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వలన మూత్రపిండాల పని తీరును మెరుగు పరిచి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, మూత్ర పిండాల్లో రాళ్ల వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
గుండె ఆరోగ్యానికి బార్లీ నీళ్లు చాలా మంచివి. రక్తపోటును అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని ప్రతి రోజూ తాగడం వలన గుండె సమస్యల భయమే ఉండదని చెబుతారు.
డయాబెటీస్‌తో బాధపడే వారు ఈ నీటిని తమ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది వ్యాధిని తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ బార్లీ నీటిని తాగాలంటారు.