భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత తల స్నానం చేయకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

భోజనం చేసిన తర్వాత టీ తాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరం ఐరన్ గ్రహించడం కష్టమవుతుంది.

తిన్న వెంటనే వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే వికారం, మగత వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆహారం తీసుకున్న తర్వాత స్మోక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. జీవక్రియపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. ఇలా చేస్తే కడుపులోని యాసిడ్.. అన్నవాహికలోకి వెళ్లి గుండెల్లో మంటకు కారణమవుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.