వర్షాకాలంలో నీరు తక్కువ తాగుతున్నారా..!

వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం అంతగా వేయదు. దీంతో చాలా మంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు.

ఒకవేళ మీరు కూడా అలా తక్కువ నీళ్లు తాగుతున్నట్లయితే ఈ ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి

దాహం వేయనంత మాత్రాన నీళ్లు తాగడం మానేస్తే, వర్షాకాలంలో కూడా డీహైడ్రేషన్ బారిన పడవచ్చు.

శరీరంలో తగినంత నీరు లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా అవసరం. లేకపోతే చిన్న చిన్న పనులు చేసినా త్వరగా అలసిపోతారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో నీటి శాతం తగినంతగా లేనప్పుడు చర్మం దాని మెరుపును కోల్పోతుంది.

దీనితో పాటు మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. తగినంత నీరు తాగే అలవాటు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది

శరీరంలో నీటి స్థాయి తగ్గితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం 3లీటర్ల నీరు తాగాలి.