ఏంటి పానీపూరి వల్ల ఇన్ని లాభాలా..  ఈ విషయం  తెలిస్తే షాకవ్వడం ఖాయం..

 పానీపూరిలో స్టఫ్ చేసే మిశ్రమాన్ని శనగలతో తయారుచేస్తారు. ఈ శనగలలో ఫైబర్ మెండుగా ఉంటుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

పానీపూరి స్టఫింగ్ లో పొటాషియం, విటమిన్-సి, పైబర్ వంటివి ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు మంచివి.

పానీపూరిలో స్టఫ్ లో ఉల్లిపాయ, శనగలు, బంగాళదుంప, మొదలైనవాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

పానీపూరిలో తయారు చేసిన పానీలో విటమిన్-సి, ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా సహాయపడతాయి.

పానీపూరీ పానీ తయారీలో జీలకర్ర, కొత్తిమీర, పుదీన, అల్లం మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడతాయి.

బరువు తగ్గాలని అనుకునేవారు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పానీపూరి దీనికి సరైన ఎంపిక.

పానీపూరి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బయట వీధులలో పానీపూరీ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.