పక్షవాతం వచ్చే ముందు కనిపించే  లక్షణాలు ఇవే..  

 ఇటీవల చాలామందిని బాధపెడుతున్న జబ్బు పక్షవాతం. పక్షవాతం బారిన పడిన వారి బాధ వర్ణణాతీతం.

సరిగా నడవలేకపోవడం, తడపడటం లేదా బరువు నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

పక్షవాతం వచ్చే ముందు కంటి చూపు కూడా మందగిస్తుంది. ఒక కంటి చూపు వంకరగా అనిపిస్తుంది. కొన్నిసార్లు రెండు కళ్ల చూపు మందగిస్తుంది.

పక్షవాతం రావటానికి ముందు మాటల్లో తడబాటు ఉంటుంది. మాట్లాడే మాటలు అర్థం కాకుండా ఉంటాయి.

రెండు చేతుల్ని ఒకేసారి పైకి లేపమని అడిగితే ఒకచేయి జారిపోవడం గమనించవచ్చు. ఇది పక్షవాతాని సూచనే.

తల తిరుగుతున్నట్టు అనిపించటం, గందరగోళంగా అనిపించటం మొదలైనవి కూడా కొన్ని సందర్భాల్లో పక్షవాతం సంకేతాలు కావచ్చు.

పక్షవాతం వచ్చే ముందు చెవిలో శబ్దాలు అస్పష్టంగా వినబడతాయి. కొన్ని సార్లు రెండు చెవుల్లో శబ్దాలు వినిపిస్తాయి.

ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.