చాలా మంది పచ్చి గుడ్లు తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి..
పచ్చి గుడ్డును నేరుగా తాగవచ్చు. కానీ ఒకటి లేదా రెండు వరకు ఓకే. మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు రావచ్చు.
వేడి చేసి, ఉడికించి తింటే ఈ బ్యాక్టీరియా నశిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు గుడ్లను ఉడికించి లేదా ఆమ్లెట్ రూపంలోనే తీసుకోవాలి. లేదంటే ఇమ్యూనిటీ మరింత నశించి.. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, వాంతులు, జ్వరం వస్తాయి. బయోటిన్ లోపిస్తుంది.
దురద, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు మాత్రమే పచ్చి గుడ్లను తీసుకోవడం మంచిది.