పులియ బెట్టిన ఆహారం తింటే  ఆరోగ్యానికి మంచిదేనా?

పులియబెట్టిన పదార్థాలతో తయారు చేసిన అల్పాహారం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని  నిపుణులు చెబుతున్నారు.

కనీసం రెండు వారాల పాటు రోజు బ్రేక్ ఫాస్ట్ పులియబెట్టిన ఆహారం తింటే కలిగి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు.

 వీటిలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

పులియబెట్టే ప్రక్రియ కొన్ని పోషకాలను పెంచుతుంది. సులభంగా శోషించబడేలా చేస్తుంది.

పులియబెట్టిన ఆహారాలు ఉబ్బరం, మలబద్ధకం, వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.