బ్రహ్మీ అనేది ఆయుర్వేదంలో  విరివిగా వాడే ఒక ఔషధ మూలిక.

ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ  మొక్కనే సరస్వతి మొక్క అని కూడా పిలుస్తారు..

పేరుకు తగ్గట్టుగానే ఈ ఆకు తెలివితేటలను పెంచుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతారు.

జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బ్రహ్మీ మూలిక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి. హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి బ్రహ్మీ మూలిక మంచి ఎంపిక. బ్రహ్మీ మూలిక జీవక్రియ రేటును పెంచుతుంది.

ఆకలిని అదుపులో ఉంచి. కాలేయ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.