కంటిచూపు మెరుగుప‌డాలని ఉందా..? అయితే రోజూ ఇవి తినండి..!

సాల్మన్ చేప: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం, ఇది కంటి పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

క్యారెట్లు: విటమిన్ ఎగా మారే బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రెటీనా ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

పాలకూర:ల్యూటిన్ మరియు జియాక్సంతిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇవి కంటిని రక్షిస్తాయి.

గుడ్లు: వీటిలో ల్యూటిన్, జియాక్సంతిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సిట్రస్ పండ్లు:నారింజ, బత్తాయి వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నట్స్:బాదం, ఇతర గింజలలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది కంటి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

బ్లూబెర్రీస్: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది.

చిలగడదుంపలు : బీటా-కెరోటిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.