ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!!
అధికంగా ప్రొటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల మూత్ర పిండాలపై అధిక భారం పడుతుంది. మూత్ర పిండాలు పాడయ్యే అవకాశం కూడా ఉంది.
గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అవసరానికి మించి ప్రొటీన్ తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు కొవ్వుగా మారి బరువు పెరుగుతారు.
ప్రొటీన్ పౌడర్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు లోపించవచ్చు.
అధిక ప్రొటీన్ తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
అధిక ప్రొటీన్, ముఖ్యంగా జంతు సంబంధిత ప్రోటీన్, మూత్రంలో కాల్షియం, యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి కిడ్నీల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్ని ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు, పురుగుమందులు అవశేషాలు ఉంటాయి. అవి క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.
Related Web Stories
ఈ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
గోల్డెన్ మిల్క్ ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా
ఈ ఫుడ్ తింటే కీళ్ల నొప్పులు మాయం
నిద్ర పట్టడం లేదా.. రోజూ పావుగంట ఇలా చేస్తే..