నిద్ర పట్టడం లేదా.. రోజూ పావుగంట ఇలా చేస్తే..  

నేడు ప్రతి ఒక్కరి జీవనశైలి దాదాపుగా మారిపోయింది. 

అంటే.. సమయానికి తినకపోవడం, తగినంత నిద్రపోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

ఇవి మన శరీరంతోపాటు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.  

దాంతో నిద్ర లేమి సమస్యతో కోట్లాది మంది ప్రజలు బాధపడుతున్నారు.

అందువల్ల శారీరక శ్రమ చేయడం వల్ల ఈ నిద్ర లేమి సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. 

ప్రతి రోజూ 15 నిమిషాలపాటు స్కిప్పింగ్ చేయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

స్కిప్పింగ్ చేయడం వల్ల కంటి నిండా నిద్ర పట్టడమే కాకుండా.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ప్రతి రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల.. ఇది కేలరీలను త్వరగా బర్న్ చేసే కార్డియో వ్యాయామం. ఇది జీవక్రియను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. 

ఇది గుండెను బలోపేతం చేసి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.

ప్రతి రోజు ఈ వ్యాయామం.. 15 నిమిషాలు ఇలా చేయడం వల్ల కాళ్లు, తొడలు, చేతులు, భుజాల కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది ఆస్టియోపోరోసిస్, ఎముకల పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

కండరాలు బలహీనంగా ఉన్న వారికి స్కిప్పింగ్ చాలా ప్రయోజనకరమని చెబుతున్నారు.

చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురైతే ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయండి. ఈ వ్యాయామంతో ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సహనాన్ని పెంచుతుంది. ఇది రోజంతా శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది.

స్కిప్పింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. మనస్సుకు విశ్రాంతినిస్తుంది. తద్వారా రాత్రి పూట మంచి గాఢ నిద్ర పడుతుంది.