ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే  సమస్యలు ఇవే..

కొందరు జిమ్ము, డైట్ల పేరుతో ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తింటున్నారు

ఈ అలవాటు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడటం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు

 కిలో శరీరబరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ మాత్రమే అవసరం

కాబట్టి మీ బరువును బట్టి మీకెంత ప్రొటీన్ అవసరమో లెక్క వేసుకోవచ్చు

శరీరంలో ప్రొటీన్ ఎక్కువైతే శరీరం నీరసించి తీవ్రమైన దాహం కలుగుతుంది

ఆహారంలో అధిక ప్రొటీన్ నోటి దుర్వాసనకు కారణమేనంటున్నారు

 ప్రొటీన్ శరీరంలో అధికమైతే మలబద్ధకం సమస్య కూడా ఎక్కువవుతుంది

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని కలిగిస్తాయి