చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు.
అయితే చలికాలంలో వేన్నీళ్ల స్నానం చేయడం వాళ్ళ కొన్ని సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల కుదుళ్లలోని పోషకాలు తగ్గిపోతాయి. దీంతో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. వెంట్రుకలు తొందరగా డ్యామేజ్ అవుతాయి.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు వంటి సమస్యల వచ్చే అవకాశం ఉంది.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీంతో ముడతలు పెరుగుతాయి. దీనివల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలు పెరుగుతాయి.
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. వేడి నీటితో మాత్రం వద్దు.
Related Web Stories
దానిమ్మ ఆకుల్లో ఇన్ని ఔషధ గుణాలా..? తెలుసుకుంటే షాక్..!
అటుకులు vs ఓట్స్: ఏది ఎప్పుడు తింటే మంచిది!
టీ, బిస్కెట్ కాంబినేషన్.. ప్రత్యేక కారణమిదే
సీతాఫలాన్ని వీళ్లు అస్సలు తినకూడదు