థైరాయిడ్ మెడిసిన్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

పరగడుపునే ఈ మెడిసిన్ వేసుకోవాలి. అప్పుడే శరీరం ఈ ఔషధాన్ని పూర్తిస్థాయిలో గ్రహించగలుగుతుంది. 

థైరాయిడ్ మందు వేసుకున్నాక కనీసం 30 నుంచి 60 నిమిషాల తరువాతే ఆహారం తీసుకోవాలి. 

కాల్షియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్స్ ఈ మెడిసిన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి

థైరాయిడ్ మందు శరీరంలోకి చేరకుండా కాఫీ అడ్డుపడుతుంది. మందు వేసుకున్న కొన్ని గంటల తరువాతే కాఫీ తాగాలి.

ఈ మందు వేసుకున్నాక నీరు తాగితే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఔషధాన్ని శరీరం గ్రహిస్తుంది. 

రాత్రిళ్లు ఈ మెడిసిన్ వేసుకోదలిస్తే తిన్న తరువాత మూడు నాలుగు గంటలు ఆగాకే టాబ్లెట్ వేసుకోవాలి

థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు ఉపవాసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.