ఎముక బలం పెరగాలంటే.. వీటిని ఇలా తినండి..

ఖర్జూరాన్ని పాలలో నానబెట్టి తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖం మెరుస్తోంది.

వీటిని పాలలో నానబెట్టి తినటం వల్ల పొటాషియం అధికంగా లభిస్తుంది. దీంతో రక్తపోటు నియంత్రించ వచ్చు.

కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించ వచ్చు.

ఇవి అధిక పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి5 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వివిధ రకాల అమైనో ఆమ్లాలతో పాటు సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం సైతం పుష్కలంగా ఉంటాయి. 

నీటిలో కంటే.. పాలలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం అధిక ప్రయోజనమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12తోపాటు అనేక ముఖ్యమైన ఖనిజాలుంటాయి.

ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, సహజ చక్కెర, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు అనేక ఇతర ఖనిజాలుంటాయి.

పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇది పిల్లలు, వృద్ధులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.

వీటిలో అధిక శాతం సహజ చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

పాలు, ఖర్జూరం.. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.