ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల  జాగ్రత్తగా ఉండాలి..

ఆస్తమాతో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆస్తమాతో బాధపడేవారు పాలు, జున్ను, ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

పాల ఉత్పత్తులలోని ప్రోటీన్, కొవ్వు.. శరీరంలో శ్లేష్మం పెరగడానికి కారణమవుతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

చిప్స్, ప్యాక్ చేసిన నూడుల్స్, ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా సమస్య పెరుగుతుంది.

ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల అలెర్జీలు, వాపు సమస్య పెరుగుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం మంచిది కాదు

నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది.

స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, శీతల పానీయాలు వంటి తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రమాదం పెరుగుతుంది.